మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో యూరి యా ఎరువుల కొరత లేదని, రైతులకు అవసరమై న మేరకు నిల్వలు అందుబాటులో ఉన్నాయని వ్య వసాయ శాఖ ఆదివారం బులిటెన్‌లో వెల్లడించిం ది. యూరియా బుకింగ్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీని పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 73.99 లక్షల బ స్తాల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, వీటిలో మార్క్‌ఫెడ్ గిడ్డంగుల్లో 52.35 లక్ష ల బస్తాలు, రిటైలర్ల వద్ద 13.99 లక్షల బస్తాలు, సహకార సంఘాల వద్ద 5.49 లక్షల బస్తాలు,

ఇ తర గిడ్డంగుల్లో 2.16 లక్షల బస్తాలు నిల్వగా ఉ న్నాయని వివరించింది. యూరియా బుకింగ్ యా ప్ ద్వారా ఇప్పటివరకు 28.71 లక్షల మంది రై తులు నమోదు చేసుకుని ఎరువులను బుక్ చేసుకున్నారని, మొత్తం 110.77 లక్షల బస్తాల యూ రియా బుక్ కాగా, అందులో 99.04 లక్షల బస్తా లు ఇప్పటికే కొనుగోలు చేశారని, దీంతో యాప్ ద్వారా బుక్ చేసిన యూరియాలో 89.42 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని పేర్కొంది. యూరి యా బుకింగ్ యాప్ ద్వారా రైతులు ముందుగానే బుకింగ్ చేసుకుని సమీప విక్రయ కేంద్రాల్లో ఎరువులు పొందే అవకాశం కల్పించడంతో పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారింది. రైతులు క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

జిల్లాల వారీగా కొనుగోళ్లు

యాప్ ద్వారా అత్యధికంగా యూరియా కొనుగో లు చేసిన జిల్లాల్లో నల్గొండ 2.46 లక్షల మంది రై తులు, 8.71 లక్షల బస్తాలు కొనుగోలు చేసి మొ దటి స్థానంలో  నిలిచింది. తరువాతర వరుసగా నిజామాబాద్ 8.54 లక్షలు, కామారెడ్డి 6.58 లక్షలు, సూర్యాపేట 5.08 లక్షలు, సిద్దిపేట 4.10 లక్షలు, సంగారెడ్డి 4.31 లక్షల బస్తాల కొనుగోలు చేశాయి. ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి నిరంతరం యూరియా రాక కొనసాగుతోందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. అవసరమైన మేరకు నిల్వలు ఉండటంతో పాటు సమయానికి సరఫరా జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.