మన తెలంగాణ/హైదరాబాద్: వేర్వేరు శాఖలో పనిచేస్తున్నట్టు ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించి నెలకు రెండు జీతాలు తీసుకుంటున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 40 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ భారీ కుంభకోణానికి పాల్పడ్డట్టు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే దీనిపై ఆర్థిక శాఖ ప్రభుత్వానికి నివేదిక అందించడంతో వారిపై చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఆర్థిక శాఖ అందించిన నివేదిక ఆధారంగా వారిపై ఏడు రోజుల్లోగా క్రిమినల్ చర్యలు చేపట్టాలని, శాఖాపరమైన చర్య లు తీసుకోవడంతో పాటు ఈ 40 మంది డ్రా చేసిన లక్షల రూపాయల జీతాలను సైతం రికవరీ చేయాలని సిఎస్ సంజయ్‌జాజు ఆయా శాఖల హెచ్‌ఓడిలకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధిం చి సర్కులర్ మెమో నెంబర్ 4079587-ఏ/1302/ఏ2/హెచ్‌ఆర్‌ఎం.7/2026ను ఈనెల 06వ తేదీన సిఎస్ సంజయ్‌జాజు జారీ చేశారు. అయితే, ప్రభుత్వాన్ని మోసం చేసిన ఉద్యోగుల్లో హోంశాఖలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులే అధికంగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది.

ప్రభుత్వ ఉద్యోగుల ఆధార్ మ్యాపింగ్ సందర్భంగా తీగలాగితే డొంక కదిలినట్టు ఈ భారీ అవినీతి బయటపడింది. ఐఎఫ్‌ఎంఎస్ వెబ్‌సైట్‌లో ఆధార్‌ను లింక్ చేయడంతో ఈ 40 మంది ప్రభుత్వ ఉ ద్యోగులు ఒక చోట తమ ఆధార్‌కార్డును ఉపయోగించగా మరోచోట డూప్లికేట్ ఆధార్‌కా ర్డు నెంబర్‌ను వినియోగించడం, వేర్వేరు పేర్ల తో పాటు ఒకే ఆధార్ నెంబర్‌ను చూపించి ల క్షల్లో జీతాలు డ్రా చేసిన ట్టు ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం ఆర్థిక శాఖ ఐఎఫ్‌ఎంఎస్ వెబ్‌సైట్‌లో ఉద్యోగుల ఆధార్‌కార్డును, ఉద్యోగుల ఐడీనెంబర్‌లను లింక్ చేయడంతో ఈ 40 మంది ఉద్యోగుల బాగోతం బయటపడింది. పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేటి వ్, అర్భన్ డెవలప్‌మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్, హోం డిపార్ట్‌మెంట్, రెవెన్యూ, హయ్యర్ ఎడ్యుకేషన్, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఆర్థికశాఖ, హెచ్‌ఎంఎఫ్‌డబ్లులలో ఈ 40 మంది పనిచేస్తున్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ఐఎఫ్‌ఎంఎస్ వెబ్‌సైట్‌లో ఉద్యోగుల వివరాలు, ఆధార్ నెంబర్‌లను డిజిటలైజేషన్ చేసినప్పుడు ఈ 40 మంది ఉద్యోగుల డూప్లికేట్ ఆధార్‌కు సంబంధించిన వివరాలు, వారి ఐడీ నెంబర్‌లు, వారు పనిచేస్తున్న శాఖలు బయటపడ్డాయి.

దీనిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఈ 40 మందిపై శాఖాపరమైన విచారణ జరపాలని సిఎస్ ఈ శాఖల హెచ్‌ఓడిలకు ఉత్తర్వులు జారీ చేశారు. కొందరు ఒకే శాఖ నుంచి రెండు జీతాలు తీసుకుంటుండగా మరికొందరు వేర్వేరు శాఖల నుంచి పేర్లు మార్చి లక్షల్లో జీతాలు డ్రా చేయడం విశేషం. కొందరు ఒకటే ఆధార్ నెంబర్‌ను సమర్పించి జీతాలు పొందగా మరికొందరు మాత్రం డూప్లికేట్ ఆధార్ నెంబర్‌లను సమర్పించి ఈ జీతాలు డ్రా చేసినట్టుగా తేలింది.

డ్రా చేసిన ఉద్యోగుల వివరాలు ఇలా..

(పబ్లిక్‌హెల్త్ డిపార్ట్‌మెంట్)లో పనిచేస్తున్న డి.ప్రమీల రాణి (ఉద్యోగి కోడ్ 1821449)తో జీతం డ్రా చేస్తుండగా, సదరు ఉద్యోగి ఇదే డిపార్ట్‌మెంట్ నుంచి కె.ప్రమీల పేరుతో (ఉద్యోగి కోడ్ 1822239)తో కూడా జీతం డ్రా చేస్తున్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ఇక, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్ ఉద్యోగిగా పనిచేస్తున్న కిందింటి మోహన్‌రెడ్డి (ఉద్యోగి కోడ్ 1719243), ఇదే శాఖ నుంచి బసిరెడ్డి మోహన్‌రెడ్డి పేరుతో (ఉద్యోగి కోడ్ 1755475)తో జీతాన్ని డ్రా చేశారు. అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్ ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రీమతి లావణ్య దుబ్బల (ఉద్యోగి కోడ్ 1700077)తో పాటు కో ఆపరేటివ్ శాఖలో రెగ్యులర్ ఉద్యోగి రమాదేవి పేరుతో (ఉద్యోగి కోడ్ 1701377)తో జీతాన్ని డ్రా చేశారు.

హోం శాఖలో రెగ్యులర్ ఉద్యోగిగా పనిచేస్తున్న పి.ఝాన్సీలక్ష్మి (ఉద్యోగి కోడ్ 1903608)తో పాటు తాటిబండ్ల ఝాన్సీలక్ష్మి పేరుతో ఇరిగేషన్ శాఖలో రెగ్యులర్ ఉద్యోగిగా (ఉద్యోగి కోడ్ 1909489) జీతాన్ని పొందారు. ఫైనాన్స్‌లో రెగ్యులర్ ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రీసరవల్లీ కమల (ఉద్యోగి కోడ్ 2601629)తో పార్వతీబాయి పేరుతో రెవెన్యూ శాఖలో రెగ్యులర్ ఉద్యోగిగా (ఉద్యోగి కోడ్ 2599511) జీతాన్ని పొందారు. అగ్రికల్చర్ శాఖలో రెగ్యులర్ ఉద్యోగిగా పనిచేస్తున్న దేవులపల్లి రమాదేవి (ఉద్యోగి కోడ్ 2101237)తో పాటు డిజిపి కార్యాలయంలో రెగ్యులర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్టు డి.వినాయక రావు పేరుతో రెగ్యులర్ ఉద్యోగిగా (ఉద్యోగి కోడ్ 1252743)తో జీతాన్ని డ్రా చేశారు.

ఒకే ఉద్యోగి రెవెన్యూ శాఖ, పబ్లిక్‌హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో జీతం డ్రా

రెవెన్యూ శాఖలో రెగ్యులర్ ఉద్యోగిగా పనిచేస్తున్న కొడెం నరసింహామూర్తి (ఉద్యోగి కోడ్ 1631345), పబ్లిక్‌హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో బజ్జాని చిన్నమ్మాయి పేరుతో రెగ్యులర్ ఉద్యోగిగా (ఉద్యోగి కోడ్ 1631158) జీతాన్ని పొందడం విశేషం. హోంశాఖలో రెగ్యులర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఎన్.మధన్ (ఉద్యోగి కోడ్ 1252756)తో జీతాన్ని డ్రా చేస్తూ, పంచాయతీరాజ్ శాఖలోనూ బిక్కసాని లత పేరుతో రెగ్యులర్ ఉద్యోగిగా (ఉద్యోగి కోడ్ 1606065)తో జీతాన్ని డ్రా చేశారు. రెవెన్యూ శాఖలో రెగ్యులర్ ఉద్యోగిగా పనిచేస్తున్న నిమ్మ ఎన్‌ఆర్ సరిత (ఉద్యోగి కోడ్ 1707753)తో జీతాన్ని డ్రా చేస్తూనే ఎంఏయూడిలో బి.విద్యాసాగర్ పేరుతో (ఉద్యోగి కోడ్ 10688676)తో జీతాన్ని డ్రా చేసినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. పంచాయతీరాజ్ శాఖలో రెగ్యులర్ ఉద్యోగిగా పనిచేస్తున్న తంగెళ్ల నరేష్‌కుమార్ రెడ్డి (ఉద్యోగి కోడ్ 0959375),

ఇదే శాఖలో పూసపాటి నరేష్ పేరుతో రెగ్యులర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్టు (ఉద్యోగి కోడ్ 2901281)తో ఒకే ఆధార్‌నెంబర్‌తో జీతాన్ని డ్రా చేశారు. హెచ్‌ఎంఎఫ్‌డబ్లులో రెగ్యులర్ ఉద్యోగిగా పనిచేస్తున్న కుమ్మరి నిర్మల (ఉద్యోగి కోడ్ 1345768), ఇదే శాఖలో పాముల లక్ష్మీపేరుతో (ఉద్యోగి కోడ్ 1353907)తో జీతాన్ని డ్రా చేశారు. కుమ్మరి నిర్మల వేర్వేరు ఆధార్‌నెంబర్‌లతో ఒకేశాఖలో రెండు జీతాలను పొందినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. గిరిజన శాఖలో రెగ్యులర్ ఉద్యోగిగా పనిచేస్తున్న బానోతు నాగేశ్వరరావు (ఉద్యోగి కోడ్ 1646349), ఇదే శాఖలో బుగ్గా రుబీనా పేరుతో (ఉద్యోగి కోడ్ 1645349) ద్వారా జీతాలను డ్రా చేశారు. బానోతు నాగేశ్వరరావు ఒకే ఆధార్‌నెంబర్‌ను ఈ రెండు ఉద్యోగాలకు చూపించినట్టుగా ప్రభుత్వం గుర్తించింది.