
సరస్వతి పుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం టిజిఎస్ ఆర్‌టిసి మే 21గురువారం నుండి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈ స్పెషల్ బస్సు సర్వీసులు జూన్ 1 వరకు నడుపుతున్నట్లు సంస్థ ఎండి వై. నాగిరెడ్డి తెలిపారు. పవిత్ర పుష్కర స్నానాలు ఆచరించేందుకు కాళేశ్వరానికి వెళ్లే భక్తులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా వారి ప్రయాణం సురక్షితంగా, సుఖవంతంగా సాగేలా అధునాతన బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. భక్తుల రద్దీ, అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. హైదరాబాద్, నర్సంపేట, తొర్రూరు, భూపాలపల్లి, మణుగూరు, కరీంనగర్, మంథని, హన్మకొండ,
మహబూబాబాద్, జనగాం, పరకాల, నిజామాబాద్, గోదావరిఖని, మంచిర్యాల వంటి ముఖ్య ప్రాంతాల నుంచి నేరుగా కాళేశ్వరానికి బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. బస్సుల వేళలు, ఇతర వివరాల కోసం సంబంధిత డిపోలను సంప్రదించవచ్చని తెలిపారు. నర్సంపేట: 9959226293, తొర్రూరు: 9959226053, భూపాలపల్లి: 9959226707, మణుగూరు: 9959225963, కరీంనగర్: 9959225920, మంథని: 9959225923, హన్మకొండ: 9959226049, మహబూబాబాద్: 9959226054, జనగాం: 9959226050, పరకాల: 9959226051, నిజామాబాద్: 9959226016, గోదావరిఖని: 9959225922, మంచిర్యాల: 9959226004, నంబర్లకు సంప్రదించవచ్చన్నారు.
రిజర్వేషన్ వివరాలు: పుష్కరాలకు వెళ్లే ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ల కోసం ఆర్‌టిసి అధికారిక వెబ్‌సైట్ www.tgsrtcbus.in ద్వారా తమ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.భక్తులందరూ ఈ ప్రత్యేక బస్సు సర్వీసులను వినియోగించుకుని, సురక్షితంగా కాళేశ్వర సరస్వతి పుష్కరాల యాత్రను విజయవంతం చేసుకోవాలని ఎండి నాగిరెడ్డి కోరారు.











