
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం సుభాష్ చంద్రకు చెందిన వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రణాళిక వివాదాస్పదమైంది. చంద్ర కుటుంబంతో సం బంధమున్న 5 సంస్థలు 61.78 శాతం ఓటిం గ్ హక్కులను ఉపయోగించి ఈ ప్లాన్‌ను ఆమోదింపజేశాయని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి అసమ్మతి రుణదాతలు ఆరోపించారు. మొత్తం రూ. 22,006.57 కోట్లకు పైగా బకాయిలు ఉండగా, కేవలం రూ. 6.5 కోట్లు మాత్రమే చెల్లించేందుకు ఈ ప్రణాళిక ప్రతిపాదించింది. పరిష్కార కమిటీ (సిఒసి)లో ఈ ప్లాన్ 80.81 శాతం ఆమోదం పొందింది. ఆ 5 సంస్థలు అసోసియేట్లు లేదా సంబంధిత విభాగాలు అని, అందువల్ల ఓటింగ్‌కు అనర్హులని బ్యాంకులు వాదిస్తున్నాయి. ఎన్‌సిఎల్‌టి బెంచ్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వగా, మూడో సభ్యుడు నిలేష్ శర్మ ప్లాన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. కెనరా బ్యాంక్ (1.60 శాతం ఓటింగ్), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (3.2 శాతం) అప్పీలుకు సిద్ధమవుతుండగా, సభ్యురాలు రీనా సిన్హా పూరి విధానపరమైన లోపాలను ప్రశ్నించారు. మరోవైపు, తనపై ఉన్న అసలు క్లెయిమ్ రూ. 3,992 కోట్లు మాత్రమేనని సుభాష్ చంద్ర స్పష్టం చేశారు.








