
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా శామీర్ పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుంచి డిసిఎం ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.











