
హైదరాబాద్: ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో జరిగింది. ఓ యువతి ఇండిగో కంపెనీలో జాబ్ చేస్తోంది. రాత్రి విధులకు క్యాబ్‌లో వెళ్తుండగా శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలోకి కారు ఆపాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై బాధితురాలు శంషాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.











