నవతెలంగాణ-మద్నూర్మండల పరిధిలోని శనగ రైతులు కొనుగోలు కేంద్రాలలో పంటను తూకం వేసి నెలరోజులు అవుతోంది. అయినా ఇప్పటి వరకు తమకు నగదు చెల్లించలేదని వారు వాపోయారు. ఈ క్రమంలో శనివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయాన్ని వారు ముట్టడించారు. నేడు తహశీల్దార్ అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ తహశీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. శనగ పంటను నగదును వెంటనే చెల్లించాలని అందులో పేర్కొన్నారు.

The post శనగ పంట నగదు చెల్లించాలని తహశీల్దార్ కు వినతి appeared first on Navatelangana.