టెస్టు సిరీస్ లో భాగంగా శ్రీలంక-టీమిండియా జట్ల మధ్య జరగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ తో తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన కెఎల్ రాహుల్ అర్ధ శతకంతో రాణించాడు. 77 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 32 పరుగుల వద్ద రనౌటయ్యాడు. కెప్టెన్ శుభ్ మన్ గిల్(16) విఫలమయ్యాడు.

ఇక, వన్ డౌన్ లో వచ్చిన యంగ్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ అద్భుత ఆటతో ఆకట్టుకున్నాడు. శ్రీలంక బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ వేగంగా పరుగులు రాబట్టాడు. కేవలం 134 బంతుల్లోనే శతకం సాధించాడు. ఈ క్రమంలో పడిక్కల్ అరుదైన ఘనత అందుకున్నాడు. స్వాతంత్ర్య దినోత్సం రోజున టెస్టు మ్యాచ్ లో సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్ గా పడిక్కల్ నిలిచాడు. దీంతో భారత్ తొలి రోజు ఆటముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పడిక్కల్(131), రిషబ్ పంత్(27)లు ఉన్నారు.