ఆర్‌ఎక్స్ 100, మంగళవారం చిత్రాలలో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం ’శ్రీనివాస మంగాపురం’ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో వర్సటైల్ యాక్టర్ బ్రహ్మాజీ కీలక పాత్రని పోషిస్తున్నారు. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘బాలు’ పాత్రలో ఆయన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో మైక్ పట్టుకొని హ్యాపీ వైబ్‌లో కనిపించారు బ్రహ్మాజీ. అగ్ర నిర్మాత అశ్వని దత్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. పి కిరణ్ నిర్మిస్తున్నారు.