
శ్రీశైలం జలాశయానికి గురువారం జూరాల ప్రాజెక్టు నుంచి 85 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుంది. ఎగువ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలతో పాటు కృష్ణానది పరివాహక ప్రాంతమైన తెలుగు రాష్ట్రాలలో సైతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం ప్రారంభమైంది. గత ఏడాదితో పోల్చుకుంటే రెండు నెలలు ఆలస్యమైన కృష్ణా నదికి వరద ప్రవాహం వస్తుండడం ఎల్ నీనో ప్రభావం ఉన్నవేళ వరదరావడం ఊరటగా చెప్పవచ్చు. ఎగువ కర్ణాటకలోని ప్రాజెక్టులు నిండుకుండగా మారడంతో జూరాల ప్రాజెక్టుకు 94 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండడంతో 12 గేట్లను ఎత్తి 47 వేల 196 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అదేవిధంగా జూరాలలో జల విద్యుత్ ను ఉత్పత్తి చేసి మరో 38వేల225 సెక్కుల నీటిని దిగువ శ్రీశైలం వైపుకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను రెండు రోజులుగా వరద ప్రవాహం వస్తుండడంతో ఆరు టీఎంసీల మేరా నీరు శ్రీశైలం జలాశయానికి చేరుకుంది దీంతో ప్రస్తుత నీటిమట్టం అడుగులలో 827. 30 అడుగులకు చేరుకుంది.215.8070 టీఎంసీలకు గాను ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 46. 8234 టీఎంసీల మేరా నీరు నిల్వ ఉంది.
గత ఏడాది జూన్ మొదటి మాసంలోనే శ్రీశైలం జలాశయానికి వరద ప్రభావం ప్రారంభమైంది. ఈ ఏడాది ఎల్ నీనో ప్రభావం కారణంగా రెండు నెలలుగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే తరుణంలో కృష్ణా నది ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలలో భారీగా వరదలు వస్తున్నడంతో 15 రోజులుగా కర్ణాటక రాష్ట్రంలోని ప్రాజెక్టులకు భారీ వరద వచ్చి చేరుతుంది. అల మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని ప్రాజెక్టును నిండడంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం దిగువ జూరాలకు నీటిని వదులుతోంది. జూరాల ప్రాజెక్టు సైతం పూర్తిస్థాయిలో నిండడంతో ప్రాజెక్ట్ అధికారులు ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం ఆధారంగా ప్రాజెక్టు గేట్లు ఎత్తి శ్రీశైలం వైపుకు నీటిని వదులుతున్నారు. దీంతోపాటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా సైతం నీటిని దిగకు వదులుతుండడంతో శ్రీశైలం జలాశయానికి ఆశాజనకంగా వరద ప్రవాహం కొనసాగుతుండడంతో తెలుగు రాష్ట్రాలకు నీటి కష్టాలు తీరుతాయన్న ఆశలు చిగురించాయి. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయిగా నిండాలంటే మరో రెండు వందల పది టీఎంసీల నీరు ప్రాజెక్టులో చేరాల్సి ఉంటుంది.











