
త్వరలో జరగబోయే హాకీ ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే భారత పురుషుల, మహిళ జట్ల కోసం హాకీ ఇండియా రూపొందించిన కొత్త జెర్సీ వివాదానికి తెరలేపిన విషయం తెలిసిందే. కొత్త జెర్సీ కాషాయ రంగులో ఉండటంతో రాజకీయంగా కొత్త చర్చకు దారి తీసింది. సుదీర్ఘ కాలంగా నీలం రంగు జెర్సీలోనే భారత జట్టు బరిలోకి దిగుతుండగా.. ఈసారి మాత్రం జెర్సీని పూర్తిగా కాషాయ రంగులోకి మార్చేశారు. అయితే ఒడిశాలోని బిజెపి ప్రభుత్వ ఒత్తిడి వల్లే ఇది జరిగిందని ఆ రాష్ట్ర మాజీ సిఎం నవీన్ పట్నాయక్ ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపి ప్రియాంక గాంధీ వాద్రా సైతం ఈ జెర్సీ రంగు మార్పు వెనుక రాజకీయ కోణం ఉందన్నారు.
ఈ క్రమంలో హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కి ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్లకు రాసిన లేఖ సంచలనంగా మారింది. ‘‘భారత జాతీయ హాకీ జట్టు జెర్సీ రంగులో మార్పు గురించి చర్చించాటీం ఇండియా కాషాయ రంగు జెర్సీ వివాదంలో కొత్త ట్విస్ట్లనుకుంటున్నాను. ఎగ్జిక్యూటివ్ బోర్డు ముందు ప్రతిపాదన లేకుండానే.. నా దృష్టికి రాకుండా ఈ నిర్ణయం జరిగిపోయింది అని అనిపిస్తోంది. జెర్సీని కాషాయ రంగులోకి మార్చడం ఒకటే నా లేఖకు కారణం కాదు. ఇది దేశానికి ప్రాతినిథ్యం వహించే జాతీయ జట్టు గుర్తింపుతో ముడిపడి ఉన్న అంశం. ఇలాంటి ప్రాధాన్య అంశం గురించి ఎన్నికైన నాయకత్వం వద్ద చర్చించకపోవడం సరికాదు. ఈ విషయం గురించి మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. దురదృష్టవశాత్తూ రాజకీయంగానే ఇది చర్చనీయాంశంగా మారింది. ప్రపంచకప్ టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న వేళ ఇలాంటి రచ్చ జరుగుతోంది. అయితే, ఇది కేవలం క్రీడాపరంగా మాత్రమే తీసుకున్న నిర్ణయమని నేను స్పష్టం చేయాలనుకుంటున్నా. ఒడిశా ప్రభుత్వం ఈ విషయం గురించి వివరణ కోరింది. కాబట్టి హాకీ ఇండియా అధికారులు నాకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త జెర్సీ రంగు ఎంపి వెనుక కారణం, రంగు మార్పు ప్రక్రియ, ఎలాంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. దీనిని ఎలా అమలు చేశారన్న అంశాలపై నాకు వివరణ కావాలి’’ అని టిర్కి లేఖలో పేర్కొన్నారు.











