
రాజకీయాల్లో దశాబ్దాలుగా పాతుకుపోయిన మూస పద్ధతులను, సంప్రదాయ రాజకీయ సూత్రాలను చెరిపివేస్తూ తమిళగ వెట్రి కళగం (టివికె) అధినేత విజయ్ సృష్టించిన ప్రభంజనం అసాధారణం అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసిన తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్‌కు కెటిఆర్ ఎక్స్ వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
సమకాలీన రాజకీయాల్లో “సంచలనం” అనే పదానికి నిలువెత్తు రూపం నేటి పరిణామాలు అని వ్యాఖ్యానించారు. మీ నాయకత్వంలో తమిళనాడు రాష్ట్రం మరింత ప్రగతి పథంలో పయనిస్తుందని, సరికొత్త పుంతలు తొక్కుతూ బలోపేతం అవుతుందని ఆశిస్తున్నాను అంటూ టివికె అధినేత విజయ్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.
విజయ్‌కు హరీష్‌రావు శుభాకాంక్షలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసిన టివికె అధినేత, నటుడు విజయ్‌కు మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.










