చెన్నై: టివికె పార్టీపై ఎఎంఎంకె పార్టీ నేత దినకరన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం పార్టీ లేఖను ఫోర్జరీ చేశారని మండిపడ్డారు. మొత్తం వీడియోను టివికె ఎందుకు విడుదల చేయడం లేదు? అని ప్రశ్నించారు. టివికె విడుదల చేసిన లేఖ తమ పార్టీ కాదు అని స్పష్టం చేశారు. మా లేఖకు దానికి చాలా తేడా ఉందని,  ఆ వీడియో ఒరిజినల్‌ కాదని మా అనుమానం అని పేర్కొన్నారు. కామరాజ్‌ పేరుతో ఫేక్‌ లెటర్‌ గవర్నర్‌కు ఇచ్చారని, ఫోర్జరీ కేసుపై దర్యాప్తు చేయాలని దినకరన్‌ సూచించారు. 

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్ఠంభన ఏర్పడింది. విసికె పార్టీ ఎటూ తేల్చకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు సందిగ్ధంలో పడింది. విజయ్‌కు మద్దతుపై విసికె క్లారిటీ ఇవ్వడం లేదు. వీసీకే ప్రెస్‌మీట్‌ సాయంత్రం 4 గంటలకు మారింది. విసికె క్లారిటీ ఇస్తేగానీ ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత రావడం లేదు.  ఢిల్లీ పెద్దల సూచన ప్రకారం ఇక్కడ స్క్రీన్‌ప్లే నడుస్తోంది. ఎలాగైనా అన్నాడిఎంకెను అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. అందుకే రిసార్ట్‌ల నుండి ఎడిఎంకె ఎమ్మెల్యేలను చెన్నైకి పిలిపించారు. విసికె మాకు మద్దతిస్తుందని నమ్మకం తమకుందని, ఈ సంక్షోభానికి ఇవాళ తెరపడుతుందని సిపిఎం అగ్రనేత బేబీ పేర్కొన్నారు.