
మన తెలంగాణ/రాజేంద్రనగర్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపిఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం క లకలం రేపింది. ట్రైనీ ఐపిఎస్ అధికారిణి ఫిర్యాదుతో తనపై కేసు నమోదైన నేపథ్యంలో మానసిక ఆందోళనకు గురై ఎర్రగడ్డ మోతీనగర్‌లో ని బంధవుల ఇంట్లో సోమవారం శానిటైజర్ లిక్విడ్ సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అపస్మారకస్థితిలో ఉన్న ఉదయ్ కృష్ఱారెడ్డిని హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆ సుప్రతికి తరలించారు. ఉదయ్ ఆ రోగ్య పరిస్థితిపై వైద్యులు స్పందించారు. ఉదయ్ కృష్ణారెడ్డిని ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయంలో స్పృహలో లేరని తెలిపారు.
వెం టనే స్టమక్‌ను వాష్ చేశామని వెల్లడించారు. ఆయన ఏమైనా విష పదార్థం తీసుకున్నారేమో అనే అనుమానంతో కుటుంబ సభ్యులు తీసుకొచ్చారన్నారు. సోమవారం ఉద యం తమ అన్నయ్య అపస్మారకస్థితిలో ఉన్నారని, వెంటనే ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు ఉదయ్ సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డి వెల్లడించారు. అయితే, ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని పోలీసులు అంటున్నారు. మద్యం అతిగా సేవించడంతోనే అపస్మారక స్థితికి వెళ్లినట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపారు. వైద్య పరీక్షల నివేదికల్లో విషపూరిత ద్రవపదార్థాల ఆధారాలు లేవని, కేవలం సింపతీ కోసమే ఆత్మహత్యాయత్నంగా తప్పుడు ప్రచా రం చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఆయన సూసైడ్ నోట్ అంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న లేఖపైన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సూసైడ్ నోట్ కలకలం..
ఉదయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం, ఆ తర్వాత ఆయన రాశారని చెబుతున్న ఒక లేఖ వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. తనపై ఫిర్యాదు చేసిన మహిళా అధికారిణిపై ఆయన అందులో పలు సంచలన విషయాలు వెల్లడించారు. అయితే, ఈ వ్యవహారంలో తన మరణానికి మరో నలుగురు వ్యక్తులు ప్రధాన కారణమని ఉదయ్ కృష్ణారెడ్డి లేఖలో స్పష్టం చేశారు. ఆ నలుగురు ఎవరు?, వారి నుంచి ఉదయ్ కృష్ణ ఏవైనా ఒత్తిడి,బెదిరింపులు ఎదుర్కొన్నారా? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. కాగా, తనపై వచ్చిన ఫిర్యాదులు, ప్రచారాలు అవాస్తమంటూ ఉదయ్ కృష్ణారెడ్డి ఇన్‌స్టా వేదికగా పోస్టు పెట్టారు. చట్టంపై విశ్వాసముందన్నారు.
సస్పెన్షన్ వేటు..
ఉదయ్ కృష్ణారెడ్డిని నేషనల్ పోలీస్ అకాడమీ అధికారులు తాత్కాలికంగా సస్పెండ్ చేసి అకాడమీ నుండి పంపించి వేశారు. తోటి మహిళా ట్రైనీ ఐపిఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ప్రివిలేజ్ కమిటీ సిసిటివి దృశ్యాలు, ఇతర కీలక ఆధారాలను సేకరించి విచారించిన అనంతరం ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమేనని నిర్ధారించి ఈ తక్షణ సస్పెన్షన్ నిర్ణయం తీసుకుంది. అయితే, భవిష్యత్తులో ఆయన సర్వీసులో చేరడానికి సంబంధించిన తుది నిర్ణయం మాత్రం కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ (డిఒపిటి) పరిధిలోనే ఉంటుందని ఎన్‌పిఎ అధికారులు స్పష్టం చేశారు.











