హైదరాబాద్: మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసులో ఉదయ్‌ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు వస్తుండగా మిర్యాలగూడ వద్ద ఉదయ్‌ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఉదయ్‌ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పిఎస్‌కు పోలీసులు తీసుకొచ్చారు. తనపై దాడి చేయడంతో పాటు లైంగికంగా వేధించాడని ఈనెల 18న అత్తాపూర్ పోలీసులకు మహిళా ట్రైనీ ఐపిఎస్‌ ఫిర్యాదు చేసింది. అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 20న ఉదయ్‌ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ తర్వాత కృష్ణారెడ్డి కనిపించకుండా పోయాడు. తాను ఎక్కడికీ పారిపోలేదని నిన్న మీడియాకు చెప్పిన విషయం తెలిసిందే. ట్రైనీ మహిళా ఐపిఎస్‌కు అధికారులు వైద్య పరీక్షలు చేయించారు. ట్రైనీ మహిళా ఐపిఎస్‌ గొంతుపై మరకలు, చెంపపై గాయాలు ఉన్నట్టు గుర్తించారు. ఎడమ కాలిపై సైతం గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.