హైదరాబాద్: ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి ఆత్మహత్నాయత్నానికి పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం మోతీ నగర్ లోని బంధువు ఇంట్లో శానిటైజర్ లో విషం కలుపుకొని ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి ఆత్మహత్నాయత్నం చేసుకున్నాడు. బంధువులు గమనించి ఉదయ్ ను ఆసుపత్రికి తరలించారు. ఎస్ ఆర్ నగర్ లోని ఆస్పత్రి ఐసియూలో చికిత్స పొందుతున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శివరాంపల్లిలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళ ఐపిఎస్ ను ఉదయ్ కృష్ణారెడ్డి  లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు రావడంతో అతడిపై కేసు నమోదైంది. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి స్పందించారు. తనపై వచ్చిన ఫిర్యాదులు, ప్రచారాలు అవాస్తవమని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. చట్టంపై పూర్తి నమ్మకం ఉందని, న్యాయం తప్పకుండా గెలుస్తుందని తెలిపారు.