బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచింది.దీంతో గ్రామాల‌కు రాక‌పోక‌లు నిలిచిపోయాయి.ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.రాగల 48 గంటల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది .అన్నారం - చండ్రుపల్లి మధ్యలో లోలెవెల్ వంతెన పైనుంచి వరద ప్రవాహిస్తుంది. దీంతో కాళేశ్వరం, మద్దెలపల్లి, పలుగుల వెళ్లే గ్రామాల‌కు రాక‌పోక‌లు నిలిచిపోయాయి.