హైదరాబాద్: బిజెపిలోకి పెద్ద నేతలు ఎవరు రారని, వస్తామన్నతన వాళ్లు రానివ్వరని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. ఉన్నవాళ్లనే ఇబ్బంది పెడుతుంటే కొత్తవాళ్లు ఎలా వస్తారు? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపిలు, ఎమ్మెల్యేల మధ్య ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయని, కేంద్రమంత్రి బండిసంజయ్, బిజెపి ఎంపి ఈటల రాజేందర్ ఎప్పుడో కలవాలని సూచించారు. టిబిజెపి అధ్యక్షుడు  రామచందర్ రావు చేతులు కట్టేసి యుద్ధం చేయమని అంటున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. తెలంగాణలో తనకు మర్యాద ఇవ్వరని, ఇక్కడ రాజకీయాల్లో ఉండనని తెలియజేశారు. బిజెపికి నష్టం జరగాలని తాను ఎప్పుడు కోరుకోలేదని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.