నవతెలంగాణ – హైదరాబాద్ : తిరుపతి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జీవకోన సమీపంలో ప్రారంభమైన మంటలు మొండోడికోన నుంచి తిమ్మినాయుడుకోన వరకు వ్యాపించి సుమారు 2 కిలోమీటర్ల మేర అడవి దగ్ధమైంది. ఈ ఘటనలో విలువైన వృక్షాలు, వనమూలికలు నాశనమయ్యాయి. వన్యప్రాణులు భయంతో పరుగులు తీశాయి. అటవీ శాఖ, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు కలిసి మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. కొండ ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.

The post తిరుమల శేషాచలం అడవుల్లో భారీ అగ్నిప్రమాదం appeared first on Navatelangana.