న్యూఢిల్లీ ః నాలుగు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై టుడేస్ చాణక్య సంస్థ తన ఎగ్జిట్ పోల్‌ను గురువారం వెల్లడించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలలో ఎన్నికల ఫలితాలను విశ్లేషించారు. ఇందులో అత్యున్నత స్థాయి రాజకీయ వేడి రగులుకున్న పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతాపార్టీకే విజయావకాశాలు ఉన్నాయని టుడేస్ చాణక్య తెలిపింది. ఈ రాష్ట్రంలో ఈసారి రికార్డు స్థాయి పోలింగ్ జరిగింది. ఇక్కడ 294 స్థానాలలో బిజెపికి 192కు పైగా స్థానాలు రావచ్చునని ఈ సంస్థ అంచనా వేసింది. కాగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కూటమికి ఈసారి 100కు పైగా స్థానాలు వస్తాయని పేర్కొన్నారు. ఇతరులకు కేవలం సున్నా నుంచి రెండు సీట్లు దక్కే వీలుంది. ఈ విధంగా చూస్తే ఈ రా ష్ట్రంలో వామపక్షాల ప్రాబల్యం మరింత దిగజారిన సంకేతా లు వెలువడ్డాయి. ఇంతకు ముందటితో పోలిస్తే బిజెపికి 3 శాతం అధికంగా అంటే 48 శాతం ఓట్లు పోలవుతాయని తెలిపారు. టిఎంసికి 38 శాతం, ఇతరులకు 14 శాతం ఓటింగ్ ఉందని తెలిపారు. టుడేస్ చాణక్య పబ్లిక్ ఒపినియన్ పోలింగ్ ఎగ్జిట్ పోల్స్ అంచనాల నిర్వహణలో ఉంది.

తమిళనాడులో అదికార డిఎంకెదే తిరిగి గెలుపు

ఇతర పోల్ సంస్థల మాదిరిగానే తమిళనాడులో అధికార డిఎంకె స్టాలిన్ నాయకత్వంలో తిరిగి ఈసారి కూడా విజయం సాధిస్తుందని టుడేస్ చాణక్య సంస్థ విశ్లేషించింది. ఓటింగ్ సరళిని బట్టి ఈ ఫలితాల సరళిని వెల్లడించారు. ఇక్కడ మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో డిఎంకెకు 125 స్థానాలు రావచ్చు. కాగా ఇక్కడ ఇటీవలే రాజకీయ ఉనికిలోనికి వచ్చిన తమిళ హీరో విజయ్ పార్టీ టివికె రంగ ప్రవేశంతోనే సత్తా చాటుకుంటుందని చాణక్య తెలిపింది. అన్నాడిఎంకె కూటమి అంటే బిజెపి ఇతర పార్టీల కలయికలోని కూటమితో పోలిస్తే ఎక్కువ స్థానాలు రానున్నాయి. టివికెకు 63 స్థానాలు రాచవ్చు. ఇక అన్నాడిఎంకె కూటమికి 45 సీట్లే వస్తాయని తెలిపారు. ఒక్కరోజు క్రితం పోల్ స ర్వేల్లో అన్నాడిఎంకె బలీయ రీతిలో రెండో స్థా నం లో ఉంటుందని, విజయ్ పార్టీ తక్కువ సీట్లు తెచ్చుకు ంటుందని తెలిపారు. చాణక్య సర్వే ప్రకారం డిఎంకె కు ఓట్లశాతం 39 శాతంగా ఉంటుంది. స్థా నంలో పోటాపోటీగానే టివికెకు 30 శాతం, అన్నాడిఎంకెకు 27 శాతం ఓట్లు రావచ్చునని తెలిపారు.

కేరళలో యుడిఎఫ్, ఎల్‌డిఎఫ్ మధ్య పోటాపోటీ

ఈసారి ఎన్నికలలో కేరళలో అధికార ఎల్‌డిఎఫ్, కాంగ్రెస్ సారధ్య యుడిఎఫ్‌కు గట్టిపోటీ ఉంటుంది. ఈ క్రమంలో యుడిఎఫ్‌కే స్వల్ప ఆధిక్యత ఉందని టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్‌తో తేల్చారు140 స్థానాల కేరళలో యుడిఎఫ్‌కు 69 స్థానాలు వస్తాయని తెలిపారు. ఇక అసోంలో ఈ సారి కూడా బిజెపి ఘన విజయం సాథిస్తుందని తెలిపారు. ఎన్‌డిఎ ఇక్కడ 50 శాతం ఓట్లతో 102 స్థానాలను దక్కించుకుంటుంది. 30 స్థానాలు ఉన్న పుదుచ్చేరిలో విజయంపై టుడేస్ చాణక్య అంచనాల మేరకు బిజెపి కూటమి ఆధిక్యత సాదిస్తుంది. ఈ కూటమికి 17 నుంచి 20 స్థానాలు రావచ్చు. ఇక కాంగ్రెస్ కూటమికి 9 నుంచి 13 సీట్లు వచ్చే అవకాశం ఉంది.