
రంగారెడ్డి: తండ్రితో కుమారుడు గొడవ పడడంతో తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తండ్రి కనిపించకపోవడంతో కుటుంబం సభ్యులు అతడిని మందలించడంతో కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కేశంపేట మండలం కేంద్రంలో రవి అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. రవికి నాని(25) అనే కుమారుడు ఉన్నాడు. 17 రోజుల క్రితం తండ్రితో రవి గొడవ పడ్డాడు. దీంతో తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో అతడి కోసం వెతికారు. తండ్రి ఎక్కడా కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తండ్రితో గొడవ పడినందుకు కుమారుడిని కుటుంబ సభ్యులు మందలించారు. తండ్రి ఆచూకీ లేకపోవడంతో తీవ్ర మనోవేధనకు కుమారుడు గురయ్యాడు. ఆదివారం బడంగ్పేట్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న వైన్ షాప్ వెనకాల నిర్మానుష్య ప్రాంతంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నాని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం నానిదిగా గుర్తించారు.














