
తైపీ: భారత యువ షట్లర్ తన్వి శర్మ ప్రతిష్ఠాత్మకమైన తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2008లో సైనా నెహ్వాల్ చివరి సారిగా తైపీ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇక 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత యువ సంచలనం తన్వి ఈ టైటిల్‌ను గెలిచి ఔరా అనిపించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో తన్వి 2116, 2116తో వియత్నాంకు చెందిన లిన్ ఎంగుయెన్‌పై విజయం సాధించింది. ఆరంభం నుంచే తన్వి దూకుడుగా ఆడింది. అద్భుత షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ లక్షం దిశగా సాగింది. ఇదే క్రమంలో ఎలాంటి ఇబ్బంది లేకుండానే వరుసగా రెండు సెట్లను గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. తన్వికి కెరీర్‌లో ఇదే తొలి బిడబ్లూఎఫ్ వరల్డ్ టూర్ 300 టైటిల్ కావడం విశేషం. కొన్నేళ్లుగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో టైటిల్స్ కోసం ఎదురు చూస్తున్న భారత అభిమానులకు తన్వి విజయం పెద్ద ఊరట ఇచ్చిందనే చెప్పాలి. కొన్ని రోజుల క్రితం భారత స్టార్ షట్లర్ పివి సింధు కూడా ఓ టైటిల్‌ను సాధించిన సంగతి తెలిసిందే.











