గల్లె: శ్రీలంక పర్యటనలో భాగంగా గల్లె స్టేడియం వేదికగా ఆతిథ్య జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో భారత్-ఎ భోజన విరామ సమయానికి 1 వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్-ఎ జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఓపెనర్లుగా సాయి సుదర్శన్, ఆయుష్ పాండేలు బరిలోకి దిగారు. వీరిరువురు చక్కగా బ్యాటింగ్ చేస్తూ.. స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలో సాయి సుదర్శన్ అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే దిలుమ్ సుదీరా బౌలింగ్‌లో ఆయుష్ పాండే(25) రవిందు ఫెర్నాండోకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజ్‌లో సాయి సుదర్శన్ (53) ఉన్నాడు.