న్యూఢిల్లీ: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దర్యాప్తు తుది దశకు చేరుకున్నట్లు కేంద్ర పౌర విమానమాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అతి త్వరలోనే ఈ ప్రమాదానికి సంబంధించిన తుది నివేదిక రానుందన్నారు. త్వరగా నివేదిక ఇవ్వడం కంటే ప్రమాదం అసలు నిజాన్ని బయటపెట్టడమే తమకు ముఖ్యమని తెలిపారు.

ఈ ఘటనపై దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదికపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. గతేడాది జూన్ 12వ తేదీన అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ ఇండియా ఎఐ 171 బోయింగ్ విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే.ఈ ప్రమాదంలో మొత్తం 260 మంది మృతిచెందారు. ఒక్కడే సజీవంగా బయటపడ్డారు.