
సికింద్రాబాద్ ఉజ్జయని మహాం కాళీ అమ్మవారి ఆషాడమాస బోనాలఉత్సవాలు అగస్టు 2 నుంచి నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మనోహర్ రెడ్డి తెలిపారు.వీటికి సంబంధించిన వివరాలను ఆయన ప్రజాప్రతినిధులకు అందచేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ... జులై 19న ఘాటాల ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయన్నారు.అగస్టు 2న అమ్మవారికి బోనాల సమర్పణ ఉంటుందని ,అదే విధంగా అగస్గు 3న రంగం (భవిష్యవాణి) కార్యక్రమం ఉంటుందని తెలిపారు.తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే
ఈ బోనాలు ఆషాడ మాసంలో అత్యంత వైభవంగా ప్రారంభం అవుతాయి.ఈ పండగలో మొదటి బోనం గొల్కొండ కోటలోని జగదాంబికా అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీ.మొదటి గురువారం లేదా ఆదివారం గోల్కోండ కోటలో ఉన్న జగదాంబికా అమ్మవారికి తొలి పూజచేసి మొదటి బోనం సమర్పిస్తారు. వందల సంవత్సరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం కుమ్మరి సంఘానికి చెందిన మహిళలు అమ్మవారికి మొదటి బోనాలు సమర్పిస్తారు.










