మన తెలంగాణ/హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు క న్నుమూశారు. అనారోగ్య కారణాలు, వృద్ధాప్య స మస్యలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో గత నెల రోజులుగా చికిత్స పొందుతున్న నా దెండ్ల భాస్కరరావు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. ఆయన అంత్యక్రియల ను పంజాగుట్ట శ్మశానవాటికలో గురువారం సా యంత్రం 4 గంటలకు నిర్వహించనున్నట్టు కు టుంబ సభ్యులు వెల్లడించారు. ప్రజల సందర్శనా ర్థం ఆయన భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్ నివాసం లో ఉంచారు. నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల ఇ రు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

లాయర్‌గా కెరీర్ ప్రారంభించి ఆపై రాజకీయాల్లోకి ఎంట్రీ

నాదెండ్ల స్వగ్రామం గుంటూరు జిల్లా కొల్లూరు మండలం దోనేపూడి. 1935, జూన్ 23న జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన నాదెండ్ల భాస్కరరావు హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులయ్యారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయ న 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతం లో అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి మంత్రివర్గం లో పనిచేశారు. 1982 లో తెలుగుదేశం పార్టీ ఏ ర్పాటు సమయంలో ఎన్టీ రామారావుతో కలిసి నడిచారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన ఎన్టీఆర్‌కు మార్గదర్శిగా తాను వ్యవహరించానని నాదెండ్ల భా స్కరరావు చెప్పుకుంటారు. -1983లో టిడిపి ఘన విజయం సాధించి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా ఆయన మంత్రివర్గంలో నాదెండ్ల భాస్కరరావు ఆర్థిక మంత్రిగా చేరారు. 1984లో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికా వె ళ్ళిన సమయంలో టిడిపిలో సంక్షోభం తలెత్తింది. నాదెండ్ల భాస్కరరావు కొంతమంది ఎమ్మెల్యేల మ ద్దతుతో రాష్ట్ర సిఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఆయన దాదాపు నెల (31 రోజుల) పాటు సిఎం గా కొనసాగారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో నాదెండ్ల సిఎం పదవికి రాజీనామా చే యాల్సి వచ్చింది. ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ గూటి కి చేరారు. 1989లో తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1994 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 1998లో ఖమ్మం నుంచి ఎంపిగా పోటీ చేసి గెలుపొందారు. మర్రి చె న్నారెడ్డి, అంజయ్య, ఎన్టీఆర్ హయాంలో మంత్రి గా బాధ్యతలను నిర్వర్తించారు. 2019లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరా రు. ఆ తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వాకింగ్ విత్ డెస్టినీ పేరుతో భాస్కరరావు ఆత్మకథ రాసుకున్నారు. ఆయన జీవితం మలిదశ లో కూడా పలు ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్‌పై ఘాటై న విమర్శలు చేసేవారు. ఆయనకు ఇద్దరు కుమారులు. మురళీధర్, మనోహర్. ఆయన భార్య పేరు లలిత. వారి వివాహం సత్యసాయి సమక్షంలో జరిగింది. నాదెండ్ల భాస్కరరావు కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్నారు. తొలుత కాంగ్రెస్‌లో కొనసాగిన నాదెండ్ల మనోహ ర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి శాసనసభకు స్పీకర్ గా వ్యవహరించారు. అలాగే, ఎపిలో కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా సేవలు అందిస్తున్నారు.

సిఎం రేవంత్ సంతాపం

నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఎంపీగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొన్నారని గుర్తుచేశారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని, భాస్కరరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. నాదెండ్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఎపి సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్ సంతాపం

నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల ఎపి సిఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. భాస్కరరావు కుమారు డు, ఎపి మంత్రి నాదెండ్ల మనోహర్‌ను సిఎం ఫోన్ లో పరామర్శించారు. నాదెండ్ల భాస్కరరావు మృ తిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ఎపి మాజీ సిఎం జగన్ సంతాపం

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైయస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు.‘నాదెండ్ల భాస్కర్ రావు ఎపి రాజకీయాల్లో విశిష్ట స్థానం సంపాదించిన నాయకుడని పేర్కొన్నారు. ప్రజాసేవలో ఆయన చూపిన నిబద్ధత, రాజకీయ అను భవం తరతరాలకు ఆదర్శమని‘ అన్నారు.