మన తెలంగాణ/హైదరాబాద్: కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టుల పనులకు నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రా ష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందులో భాగం గా భూసేకరణ, పునరావాసం, పునరావాస పరిహారం (ఆర్‌అండ్‌ఆర్) కోసం ఐదు వేల కోట్లను సమకూర్చనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపా రు. రాష్ట్ర సచివాలయంలో శనివారం కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కు మార్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగిం ది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీ ధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కు మార్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల పనులు నిధుల కొరత కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిచిపోకూడదని అధికారులను ఆదేశించారు.

పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. అవసరమైన నిధుల కోసం అధికారులు వెంటనే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఇప్పటికే రూ.2 వేల కోట్లు విడుదల కాగా, మరో రూ.3 వేల కోట్ల విడుదల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఇంజినీరింగ్ పనులతోపాటే భూసేకరణ ప్రక్రియను సమాంతరంగా కొనసాగించాలని ఆదేశించారు. భూసేకరణ, టెండర్లు, అటవీ, పర్యావరణ అనుమతులు వంటి అంశాల్లో జాప్యం లేకుం డా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాజెక్టు ల కారణంగా నిర్వాసితులవుతున్న వారికి పరిహా రం, పునరావాస ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. భూసేకరణ, పునరావాస సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అటవీ, పర్యావరణ అనుమతుల విషయంలో కూడా జాప్యం ఉండకూడదని, అవసరమైన ప్రతిపాదనలను సంబంధిత శాఖలకు వెంటనే పంపించాలని అధికారులకు సూచించారు.

నాలుగున్నరేళ్లుగా నిలిచిపోయిన మిడ్‌మానేరు ఎడమ కాలువ పనులను వెంటనే పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. భూసేకరణ, టెండర్లు, అనుమతుల ప్రక్రియలను సమాంతరంగా చేపట్టి పనులను వేగవంతం చేయాలన్నారు. పెండింగ్ సమస్యలన్నింటినీ గుర్తించి ప్రత్యేక జాబితా రూపొందించాలని, ప్రతి సమస్యను స్పష్టమైన యాక్షన్ పాయింట్‌గా మార్చాలని అధికారులను ఆదేశించారు. పత్తిపాక రిజర్వాయర్‌ను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో చేపట్టాలని, ఈ ప్రాజెక్టు ద్వారా కొత్తగా సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు 2.40 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిందన్నారు.

పత్తిపాకకు సంబంధించిన ఎల్‌ఐడిఏఆర్ సర్వే, డేటా ప్రాసెసింగ్ పూర్తయినట్లు తెలిపారు. ఆగస్టు నెలాఖరులోగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్) సిద్ధం చేస్తామని అధికారులు వెల్లడించారు. రోళ్లవాగు ప్రాజెక్టు పనులు 96 శాతం పూర్తయిన నేపథ్యంలో మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రస్తుత 0.250 టిఎంసిల నిల్వ సామర్థ్యాన్ని 0.949 టిఎంసిలకు పెంచే లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రోళ్లవాగు ద్వారా సుమారు 15 వేల ఎకరాల చివరి ఆయకట్టుకు సాగునీటి భరోసా కల్పించాలనే లక్ష్యంతో పనులు చేపట్టాలని సూచించారు. ప్రాజెక్టుకు సంబంధించిన అటవీ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. తదుపరి సమావేశానికి యాక్షన్ రిపోర్ట్ ప్రతి ప్రాజెక్టులో పెండింగ్‌లో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి బాధ్యతలు, గడువులతో కూడిన కార్యాచరణ రూపొందించాలని మంత్రి సూచించారు. ప్రతి అంశాన్ని యాక్షన్ పాయింట్‌గా మార్చి అమలు చేయాలని చెప్పారు.