ఉప్పల్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఉప్పల్‌లో ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రంపై ఎస్‌ఒటి పోలీసులు దాడి చేశారు. రామంతాపూర్‌ లక్ష్మీనారాయణ కాలనీలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గడువు ముగిసిన ఫుడ్ కలర్స్, ఫ్లేవర్లు ఉపయోగిస్తుండడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఫంగస్ పట్టిన ఎండు అంజీర్‌తో ఐస్‌క్రీమ్ తయారీ చేస్తున్నట్టు గుర్తించారు. లేబుల్ లేని ముడి పదార్థాలు, లూజ్ టూటీ ఫ్రూటీ వినియోగిస్తున్నారని, భారీగా కల్తీ ముడి పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. యూనిట్ నిర్వాహకుడు మందుల రమేష్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో రమేష్ వెల్లడించారు.