ఆక్లాండ్: నేషన్స్ కప్‌లో భాగంగా గురువారం ఉరుగ్వేతో జరిగిన లీగ్ మ్యా చ్‌లో భారత మహిళా హాకీ జట్టు 32 గోల్స్ తేడాతో విజయం సాధించింది. చివరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. 13వ నిమషంలోనే చియారా ఉరుగ్వేకు తొలి గోల్ సాధించి పెట్టింది. కానీ 24వ నిమిషంలో దీపిక చేసిన గోల్‌తో స్కోరు సమమైంది. 55వ నిమిషంలో ఉరుగ్వే గోల్ సాధించి మళ్లీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాతి నిమిషంలోనే దీపిక చేసిన గోల్‌తో భారత్ మళ్లీ స్కోరును సమం చేసింది. ఆ తర్వాత భారత్ మరో గోల్‌ను సాధించింది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత జట్టు జయభేరి మోగించింది.