మన తెలంగాణ/హైదరాబాద్ : గత వారం రోజులుగా ఉదయం ఎండ, సాయంత్రం చల్ల ని వాతావరణ వరణంతో గడిపిన ప్రజలకు తె లంగాణ వెధర్‌మ్యాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 24 నుంచి 29 వరకు ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శుక్రవారం నుంచి ఆరు రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, హైదరాబాద్ నగరంలో సైతం 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. రాష్ట్రంలో శుక్రవారం నుంచి మరోసారి తీవ్ర వడగాలులు విరుచుకుపడనున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్‌తో హెచ్చరించారు. వేడి ప్రభావంతో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు పడినా ఉపశమనం ఉండదని, తేమ పె రిగి ఉక్కపోత మరింత ఎక్కువవుతుందని తె లిపారు. దీంతో పాటు హైదరాబాద్ వాతావర ణ కేంద్రం సైతం రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు అత్యధిక జిల్లాల్లో 41 డిగ్రీలపై గా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, పలు జిల్లా ల్లో రెండు రోజుల పాటు 43 డిగ్రీలపైగా చేరే అవకాశం ఉందని,

30 జిల్లాలకు ఆరెంజ్ అల ర్ట్ జారీ చేసింది. వడగాల్పుల నేపథ్యంలో ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట కు రాకుండా జాగ్రత్త పడాలని అధికారులు సూచించారు. వర్షాలతో కాస్త ఉపశమనం ల భించినా, శుక్రవారం నుంచి శక్తివంతమైన వ డగాల్పులు ప్రారంభమవుతాయని తెలిపారు. వాహనదారులు, రైతులు తగిన జాగ్రత్తలు తీ సుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. ఈ క్రమంలో గురువారం రాష్ట్రంలో అత్యధికంగా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో దహేగాంలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, వరుసగా మంచిర్యాల జి ల్లా కాసిపేట్, నల్గొండ జిల్లా గుడిపల్లిలో 44.2, కామారెడ్డి జిల్లా పాల్వంచ, పెద్దపల్లి జి ల్లా కామ్నాపూర్‌లో 44.1, ఆదిలాబాద్ జిల్లా జైనాధ్‌లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.