న్యూఢిల్లీ: వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. అధికస్థాయిలో ఇథనాల్ కలిపిన పెట్రోల్‌కు ఎక్సైజ్ సుంకం రద్దు చేసింది. బుధవారం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. 22 శాతం నుండి 30 శాతం ఇథనాల్ కలిగిన పెట్రోల్‌పై ఎలాంటి ఎక్సైజ్ సుంకం ఉండదు. భారతదేశ ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం E20 లక్ష్యాన్ని చేరుకునే దశలో ఇది ఒక కీలక పరిణామం. ఈ మినహాయింపు E22, E25, E27, E30 వంటి ఇంధన రకాలకు వర్తింస్తుంది. E20కి పైన ఉన్న ఇథనాల్ బ్లెండ్స్ ‌కు ఇంత పెద్ద వెసులుబాటు ఇదే తొలిసారి.