
14 ఏళ్లకే ఐపిఎల్‌లోకి అడుగుపెట్టి.. తన ఆటతో దేశవ్యాప్తంగా అందరిని కట్టపడేసిన కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. అంతేకాక.. టీం ఇండియాలో చోటు దక్కించుకున్న అతి చిన్న వయస్కుడిగా కూడా వైభవ్ రికార్డు సృష్టించాడు. అయితే క్రికెట్‌లో తన ఆటతో అభిమానులను సంపాదించుకున్న వైభవ్.. ఇప్పుడు గొప్ప మనసు చాటుకున్నాడు. విద్యార్థులకు సాయం చేసేందుకు అతడు ముందుకొచ్చాడు.
‘‘గొప్ప విషయాలు రాబోతున్నాయి.. అలాగే చూస్తూ ఉండండీ’’ అంటూ శుక్రవారం వైభవ్ తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ఏంటా.. అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఇవాళ ఉదయం ఓ ప్రకటన చేశాడు. ‘నాకు ఎక్స్ ఫ్లాట్‌ఫామ్ నుంచి వచ్చే ఆదాయాన్ని అవసరమైన విద్యార్థుల చదువుకు వెచ్చించాలని భావిస్తున్నా.అర్హత కలిగిన వారు సంప్రదించగలరు. పాఠశాల, కళాశాలకు సంబంధించి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నవారికి సాయంగా ఉంటా. నాకు తోచినరీతిలో మద్దతు ఇచ్చేందుకు ప్రయత్నిస్తా’’ అని వైభవ్ పోస్ట్ పెట్టాడు. దీంతో యువ క్రికెటర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. చిన్న వయసులోనే ఇంతటి గొప్ప ఆలోచన చేసినందుకు అభినందనలు అంటూ కామెంట్లు చేస్తున్నారు.











