దులీప్ ట్రోఫీ 2026-27 సీజన్ కోసం ఈస్ట్ జోన్ స్క్వాడ్‌ను ప్రకటించింది. ఇందులో అనూహ్యంగా వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. సారథిగా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేశారు. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయంగా కెరీర్‌ను ప్రారంభించిన వైభవ్‌పై వైస్ కెప్టెన్సీ బాధ్యతలు పెట్టడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతించగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ప్రముఖ వ్యాఖ్యత హర్ష భోగ్లే కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.

‘‘రెడ్ బాల్ క్రికెట్‌లో.. అదీనూ సీనియర్లు ఉండే జట్టుకు వైభవ్‌ను వైస్ కెప్టెన్‌గా ఎలా నియమించారో నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. అతడు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇప్పటి వరకు సుదీర్ఘ ఫార్మాట్‌లో కేవలం 12 ఇన్నింగ్స్ మాత్రమే. 17.25 సగటుతో 207 పరుగులు చేశాడు. నేను అతడి టాలెంట్‌ని తక్కువ చేయడం లేదు. అద్భుతమైన నైపుణ్యం కలిగిన ప్లేయర్. కానీ, అతడు నేర్చుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి’’ అని హర్షా భోగ్లే పోస్ట్ పెట్టారు.