అమరావతి: భిక్షాటన చేసుకునే బాలికకు మాయమాటలు చెప్పి అనంతరం ఆమెను ఆటో డ్రైవర్ లొంగదీసుకున్నాడు. అనంతరం బాలిక పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ఆమెను చంపేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలోని మాధవధార జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారు..... కంచర పాలెం మండలంలోని దుర్గానగర్‌లో బొలిశెట్టి సురేష్(32) ఆటో డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఓ బాలిక భిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీస్తోంది. బాలికను సురేష్ పరిచయం చేసుకొని మాయమాటలతో లొంగదీసుకున్నాడు. అనంతరం గర్భిణీకి సాయంగా ఉండేందుకు సదరు బాలికను ఇంటికి తీసుకొచ్చాడు. మార్చి 24న సురేష్‌కు పాప పుట్టింది. తనను పెళ్లి చేసుకోవాలని బాలిక బలవంతం పెట్టడంతో పాటు ఇంటికొచ్చి గొడవకు దిగింది.

దీంతో ఆమె తలపై పదునైను ఆయుధంతో కొట్టడంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. మృతదేహాన్ని బ్యాగ్‌లో పెట్టుకొని జ్ఞానాపురం రైల్వే స్టేషన్ లో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. ఒడిశాలోని రాయగడ ప్రాంతంలోని చాందిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో ట్రాలీ బ్యాగ్‌ను పడేసి సొంతూరు వెళ్లిపోయాడు. ఆ ప్రాంతంలో దుర్వాసన వస్తుండడంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత మూడు రోజుల నుంచి ఆ ప్రాంతంలో ఫోన్ సిగ్నల్స్, కాల్ డేటాను బయటకు తీశారు. సురేష్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చినట్టు తేలడంతో వైజాగ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కంచరపాలెం పోలీసులు సురేష్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.