
లండన్: దేశం కోసం ఆడడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ తెలిపాడు. తాను క్రికెట్లో కొనసాగుతున్నకాలం తనపై విమర్శలు వస్తునే ఉన్నాయని, తాను బ్యాట్‌తో సమాధానం చెప్పానని వివరణ ఇచ్చాడు. విమర్శలపై పోరాటం చేయడం కంటే జట్టు విజయంలో భాగమయ్యేందుకు ఎక్కువ ప్రయత్నం చేస్తానని చెప్పాడు. తన కర్తవ్యాన్ని నిర్వర్తించడమే తన లక్ష్యమని కెరీర్ ఆరంభం నుంచి ఇదే పని చేస్తున్నానని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డే తరువాత రోహిత్ శర్మ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని పుకార్లు షికార్లు చేసిన విషయం తెలిసిందే. లార్డ్స్ మైదానంలో కూడా 138 పరుగులు చేసి విమర్శకుల నోళ్లు మూయించిన విషయం విధితమే.











