హైదరాబాద్: శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మాత జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ధర్మం, అహింస, సమానత్వం వంటి మహోన్నత విలువలను ప్రపంచానికి తెలియజేసిన వాసవీ మాత ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. వాసవీ మాత చూపించిన సత్య మార్గంలో నడుస్తూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఏటా వైశాఖ శుక్ల పక్ష దశమి రోజున శ్రీ వాసవీ మాత ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తుచేశారు. భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవీ మాత ఉత్సవాలను నిర్వహిస్తూ, ధర్మం, నీతి, సేవాభావం వంటి మహత్తర విలువలను మన జీవితాల్లో ఆచరిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుద్దామని రేవంత్ పిలుపునిచ్చారు.