మన తెలంగాణ/ నల్గొండ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. బ్యారేజీలపై నిర్వహిస్తున్న సమగ్ర శాస్త్రీయ పరీక్షలు చివరి దశకు చేరుకున్నాయని, వాటి ఆధారంగా మరమ్మతులు, పునరుద్ధరణకు అవసరమైన డిజైన్ల రూపకల్పన జరుగుతోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉ-త్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. వచ్చే వర్షాకాలం నాటికి కాళేశ్వరం బ్యారేజీలు పునరుద్ధరించడమే లక్షంగా పనిచేస్తున్నామని ఉ త్తమ్ తెలిపారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ఉ-న్నతాధికారులతో నిర్వహించిన సమావేశం లో మంత్రి మాట్లాడుతూ.. బ్యారేజీల పునరుద్ధరణ లో ప్రభుత్వం పూర్తిగా శాస్త్రీయ విధానాన్నే అనుసరిస్తోందని స్పష్టం చేశారు. భద్రతపై నిపుణులు పూర్తిస్థాయిలో ధ్రువీకరించే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను తిరిగి నిర్వహణలోకి తీసుకురాబోమని వెల్లడించా రు. దేశంలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసె ర్చ్ స్టేషన్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వంటి అత్యున్నత సాంకేతిక సంస్థలు నేల స్వభావం, పునాదులు, కాంక్రీట్ నిర్మాణం, ఇతర నిర్మాణ భాగాలపై విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించాయని ఆయన తెలిపారు.

ప్రస్తుతం ఆ పరీక్షలు దాదాపు పూర్తయ్యాయని, వాటి ఫలితాలను ఐఐటీ బొంబయికి పంపించగా, అక్కడి నిపుణులు సమగ్ర పునరుద్ధరణ డిజైన్లను సిద్ధం చేస్తున్నారని చెప్పారు. ప్రాథమిక అంచనాల ప్రకారం డయాఫ్రం వాల్ నిర్మాణం పునరుద్ధరణలో భాగం కావచ్చని భావిస్తున్నప్పటికీ, అన్ని సాంకేతిక నివేదికలను పరిశీలించిన అనంతరమే తుది మరమ్మతుల విధానాన్ని నిర్ణయిస్తామని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం ఏర్పాటుచేసిన సాంకేతిక పర్యవేక్షణ కమిటీ, జాతీయ ఆనకట్టల భద్రతా ప్రాధికార సంస్థ, కేంద్ర జలసంఘం సూచనలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరణ కార్యక్రమాన్ని అమలు చేస్తుందని తెలిపారు. పునరుద్ధరణ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందు కు భారత సైన్యంలో సేవలందించిన అనుభవజ్ఞులైన ఇంజినీర్ల సేవలను ప్రభుత్వం వినియోగిస్తోందని, కల్నల్ పరీక్షిత్ మెహ్రా నేతృత్వంలోని సమన్వయ కమిటీ పరీక్షలు, సాంకేతిక ప్రణాళికలను పర్యవేక్షిస్తూ పారదర్శకత, నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడించారు. సాంకేతిక అనుమతులు లభించిన వెంటనే మరమ్మతులు పూర్తి చేసి వచ్చే వర్షాకాలం నుంచి బ్యారేజీలను సురక్షితంగా వినియోగంలోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రజల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని పునరుద్ఘాటించారు. ప్రజాధనంతో నిర్మించిన ఈ కీలక ప్రాజెక్టును శాశ్వత భద్రతతో పునరుద్ధరించి రాష్ట్ర అవసరాలకు పూర్తిస్థాయిలో ఉ-పయోగపడేలా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.