పాకిస్తాన్ వెస్టిండీస్ పర్యటనలో భాగంగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్ 90 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. ట్రినిడాడ్‌లోని బ్రయాన్ లారా క్రికెట్ అకాడమీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో పాకిస్తాన్‌ను ఓడించింది. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 120 పరుగులకే కుప్పకూలింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ లో వెస్టిండీస్ 1-0 ఆధిక్యం సాధించింది. తొలి టెస్ట్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 311 పరుగులు చేసింది. షాయ్ హోప్ 92, కవెమ్ హాడ్జ్ 84 పరుగులతో జట్టును ఆదుకున్నారు. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ లో 282 పరుగులకు ఆలౌటైంది. షాన్ మసూద్ 109 సెంచరీ చేయగా, ఇమామ్ ఆల్ హక్ 63 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 181 పరుగులు చేసి పాకిస్తాన్ కు 211 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 120 పరుగులకే ఆలౌటైంది.రెండో మ్యాచ్ పోర్ట్ ఆప్ స్పెయిన్ వేదికగా ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానుంది.