హైదరాబాద్: మర్రిచెన్నా రెడ్డి మానవ వనరుల కేంద్రంలో ‘శక్తి’ కార్యక్రమాలపై సిఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్2పవర్ కంపెనీ టామ్‌కామ్‌ను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. పాస్‌పోర్టు నుంచి విదేశీ కంపెనీల్లో ఉద్యోగాల వరకు ఆ సంస్థ బాధ్యత తీసుకోవాలన్నారు.

నూతన ఆవిష్కరణల కోసం యంగ్ ఇ:డియా స్కిల్ యూనివర్సిటీలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారు. స్కిల్ యూనివర్సిటీలో విదేశీ భాషలు నేర్పేందుకు ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పించాలని చెప్పారు. ఎటిసిల్లో విద్యుత్ వాహనాలు, డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు ప్రవేశ పెట్టాలన్నారు. డిమాండ్‌కు తగినట్లుగా నర్సింగ్ కళాశాలలకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమీక్షలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.