
జైసల్మేర్: రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు చెందిన ఓ ప్రైవేటు కళాశాలలో జరిగిన డిగ్రీ పరీక్షలో ఇన్విజిలేటర్లే విద్యార్థులకు జవాబులు చెబుతూ దొరికిపోయారు. జై నారాయణ వ్యాస్ యూనివర్సిటీకి చెందిన ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ ఉదంతం బయపడింది. విద్యార్థుల 93 సమాధాన పత్రాలను సీజ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు అధికారులు ఆదేశించారు.











