మన తెలంగాణ/హైదరాబాద్: విద్యార్థులకు అవసరమైన సామగ్రి అంతా సకాలంలో అందే లా చూడాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆ దేశించారు. దుస్తులు, నోటు పుస్తకాలు, ఇతర సామగ్రి సకాలంలో అందితే విద్యార్థులు చదువుపై పూర్తి స్థాయిలో శ్రద్ధ చూపుతారని సిఎం అన్నారు. విద్యా శాఖతో పాటు బిసి, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలు, ఎస్సీ అభివృద్ధి శాఖ ల పరిధిలోని విద్యా సంస్థల్లోని విద్యార్థులకు అందజేసే సామగ్రి సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువా రం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. గతం లో ఏ శాఖకు ఆ శాఖ ప్రొక్యూర్‌మెంట్, సరఫ రా చేపట్టడంతో ఏకరూపత లోపించడంతో పాటు అనేక అక్రమాలు చోటుచేసుకునేవని వాటిని అరికట్టేందుకు సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానాన్ని తీసుకువచ్చామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గతంలో దుస్తులు, నో టు పుస్తకాలు,

ట్రంక్ పెట్టెలు, ఇతర సామ గ్రి సరఫరాకు సంబంధించి ఏ శాఖకు ఆ శాఖ చేపట్టడంతో అవకతవకలకు ఆస్కా రం ఉండేదన్నారు. అ టువంటి అవకతవకలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని సి ఎం స్పష్టం ఉండాలని అధికారులను సి ఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.నాణ్యతతో పా టు సకాలంలో అందడంపైనా ప్రత్యేక శ్రద్ధ వ హించాలన్నారు. జూన్ 15 నాటికి విద్యార్థుల కు అవసరమైన సామగ్రి అందాలని, అలా అందగానే సరఫరాదారులకు చెల్లింపులు పూర్తి చేస్తామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులకు అందజేసే వస్తువులకు సంబంధించి మండల స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అక్కడి నుంచి క్షేత్ర స్థాయిలో గ్రామాల్లోని పాఠశాలలు, హాస్టళ్లకు వస్తువులు సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని, సరఫరాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీయించాలన్నారు.


ప్రతి విద్యార్థికి వారికి అవసరమైన సామగ్రి అంతా అందిందా లేదా అనే దానిని చెక్ చేసుకోవాలని సిఎం ఆదేశించారు. నోటు పుస్తకాలు, యూనిఫాం, ఇతర సామగ్రి క్వాలిటీ వాటిని అందుకున్న తర్వాత వారి భావాలను తెలియజేసేందుకు విద్యార్థుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సిఎం సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, విద్యాశాఖల మధ్య సమన్వయానికి ఒక కమిటీని నియమించాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, ఎంపి వేం నరేందర్ రెడ్డి, సిఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యసాచి ఘోష్, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి షఫీఉల్లా, బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి బాల మాయాదేవి, సెర్ప్ సీఈఓ దివ్య, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి సంతోష్, టిజిడిసిడబ్లూఆర్‌ఐఈఎస్ కార్యదర్శి బి.సైదులు తదితరులు పాల్గొన్నారు.