
తన కెరీర్లో విభిన్నమైన సినిమాలు చేస్తూ.. ఫ్యాన్స్‌ని అలరిస్తూ వస్తున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అతడు నటిస్తున్న సినిమాల్లో ఒకటి ‘రౌడీ జనార్ధన’. కాగా, శనివారం విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ప్రత్యేక పోస్టర్‌తో విషెస్ తెలిపింది. ఇందులో విజయ్ కూర్చొని ఉండగా.. హీరోయిన్ అతడి గుండెపై కాలు మోపి ఉండటం మనం చూడొచ్చు.
‘ప్రపంచంతో పోరాడతాడు.. ప్రేమకు లొంగిపోతాడు’ అంటూ ఈ పోస్టర్‌కి క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలతో పాటు.. మంచి లవ్ ట్రాక్ కూడా ఉంటుందని అర్థమవుతోంది. ఇక రవికిరణ్ కొలా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తూర్పుగోదావరి ప్రాంతంలో 80వ దశకంలో సాగిన కథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.














