అమరావతి: బెజవాడలో మళ్లీ పొలిటికల్ హైడ్రామా ప్రారంభమైంది. విజయవాడ బాప్టిస్ట్ నగర్ లోని వైసిపి దీక్షా శిబిరం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డిఎస్సిలో అవకతవకలు జరిగాయంటూ వైసిపి రిలే దీక్ష చేశారు. వైసిపి నిరాహార దీక్షా శిబిరం దగ్గరకు టిడిపి నేతలు వచ్చారు. వైసిపికి వ్యతిరేకంగా టిడిపి నేతల నిరసనలు చేశారు. టిడిపి నేతలను, దీక్షా శిబిరానికి బయల్దేరిన బుద్దా వెంకన్నను పోలీసులు అడ్డుకున్నారు. వైసిపి, టిడిపి నేతల పోటాపోటీ గా జై జగన్ అంటూ వైసిపి, జై లోకేషక అంటూ టిడిపి నినాదాలు చేశారు.