వికారాబాద్: ఆరు నెలల క్రితం ప్రియుడి మోజులో పడి కన్న తల్లిదండ్రులకు మత్తు మందు ఇచ్చి హత్య చేసిన నర్సు సురేఖ ఇప్పుడు మత్తు మందు తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా బంట్వారం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యాచారం గ్రామానికి చెందిన సురేఖ ఓ ఆస్సత్రిలో నర్సుగా పని చేస్తుంది. యువకుడిని ప్రేమించింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో తల్లిదండ్రులు వ్యతిరేకించారు. దీంతో తల్లిదండ్రులకు స్లో పాయిజన్ రూపంలో మత్తు ఇంజక్షన్లు ఇచ్చి హత్య చేసింది. తల్లిదండ్రుల హత్యకేసులో జైలు శిక్ష అనుభవించి ఈ మధ్యనే బెయిల్ సురేఖ బయటకు వచ్చింది. బెయిల్ వచ్చినప్పటి నుంచి సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో సురేఖ ఉంటున్నారు. అదే హాస్టల్ లో మత్తు ఇంజక్షన్ వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.