కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలింపు

మన తెలంగాణ/వికారాబాద్ బ్యూరో: కన్న తండ్రే రక్షణ ఇవ్వకపోతే ఇక ఈ సమాజంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడ దో అర్థం కాని పరిస్థితులు నెలకొంటున్నాయి. కట్టుబాట్లను, మానవత్వ విలువలను కాలరాస్తూ సొంత ఇంట్లోనే ఇలాంటి అమానుషాలకు ఒడిగడుతుండటంపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కన్న కూతురిపై ఓ తండ్రి అత్యాచారం చేసిన సం ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లా కేం ద్రంలో మైనర్ కూతురిపై పలుమార్లు లైంగికదాడి పాల్పడిన ఓ తండ్రిని గురువారం వికారాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు, రెండో భా ర్యకు ముగ్గురు పిల్లలు. రెండో భార్య కొంతకాలం కిందట చనిపోయింది.

ఆమెకు ముగ్గురు కూతుళ్లు. వీరిలో చిన్న కూతురిపై కన్న తండ్రే కామాంధుడిగా మారి మైనర్ కూతురు అని చూడకుండా పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డా డు. సదరు బాలిక హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నది. తండ్రి లైంగిక దాడికి పాల్పడిన విషయాన్ని బయట ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. తండ్రి మాటలకు భయపడిన బాలిక ఎవరికీ చెప్పలేదు. హాస్టల్‌కు వెళ్లిన తరువాత తనకు కడుపునొప్పి వస్తుందని ఏడుస్తూ పాఠశాల టీచర్లు, హాస్టల్ వార్డన్‌కు చెప్పటంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై పోలీసు లు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.