నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘క్రేజీ కల్యాణం‘. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై బూసం జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు భద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. శనివారం ఈ సినిమా టీజర్ ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నందిని రెడ్డి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ “దర్శకుడు భద్రప్ప చెప్పిన ఈ కథ విని నవ్వీ నవ్వీ కడుపు నొప్పి వచ్చింది. ఫిలింమేకింగ్ లో ఒక కొత్త దర్శకుడు భద్రప్ప చూపించిన ప్రతిభకు గర్వపడుతున్నా”అని పేర్కొన్నారు.

దర్శక నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ “ఆత్మ గౌరవం కోసం కూతురు, సమాజ గౌరవం కోసం తండ్రి... ఈ ఇద్దరి సంఘర్షణ రెండు తరాల మధ్య జరిగే సంఘర్షణ కాదు, ఇది విలువల మధ్య జరిగే సంఘర్షణ. ఈ కథ సామాజిక విలువల గురించి, స్త్రీ స్వేచ్ఛ గురించి, స్త్రీ ఆత్మ గౌరవం గురించి చర్చిస్తుంది”అని తెలియజేశారు. డైరెక్టర్ భద్రప్ప గాజుల మాట్లాడుతూ “మనం నిజ జీవితంలో చూసే పాత్రలు, మన ఇరుగు పొరుగు వ్యక్తులను పోలిన క్యారెక్టర్స్ మా మూవీలో ఉంటాయి. మా చిత్రంలో నవ్వులతో పాటు మనసుకు హత్తుకునే ఎమోషన్స్ ఉన్నాయి”అని అన్నారు. డైరెక్టర్ నందిని రెడ్డి మాట్లాడుతూ - “క్రేజీ కల్యాణం సినిమా టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా 100 కోట్ల రూపాయల వసూళ్లు చేసి చరిత్ర సృష్టించాలని కోరుకుంటున్నా”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరో అఖిల్ రాజ్, వీకే నరేష్, గోరటి వెంకన్న, బూసం జగన్మోహన్ రెడ్డి, సురేష్ బొబ్బిలి, మౌనిక, శ్రీనివాస రవీంద్ర, శ్యామ్ దూపాటి, కిరీటి దామరాజు పాల్గొన్నారు.