ఈ ఏడాదిలో పలు స్మార్ట్‌ఫోన్ తయారీదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ల ధరలను పెంచాయి. ప్రపంచవ్యాప్తంగా మెమరీ భాగాల కొరత ఈ ధరల పెరుగుదలకు కారణమని తయారీదారులు పేర్కొంటున్నారు. అయితే, తాజాగా వివో కూడా వై సిరీస్‌లోని నాలుగు స్మార్ట్‌ఫోన్‌ల ధరలను పెంచింది. టిప్‌స్టర్ సంజు చౌదరి మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ Xలో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ, వివో V70 ఎలైట్, వివో V70, వివో Y400, వివో Y21 ధరలు పెరిగాయని పేర్కొన్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు రూ.1,000 నుండి రూ.4,000 వరకు తెలిపారు. ఈ క్రమంలో ఏ వివో స్మార్ట్ ఫోన్ మోడళ్లపై ఎంత పెరిగిందో ఇప్పుడు చూద్దాం.

వివో వి70 ఎలైట్ ధర

టిప్‌స్టర్ ప్రకారం, ఈ ఫోన్ 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.4000 పెరిగి రూ.54,999కి బదులుగా రూ.58,999గా, 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ కూడా రూ.4000 పెరిగి రూ.59,999కి బదులుగా రూ.63,999కి అందుబాటులో ఉంటుంది.

వివో వి70 ధర

ఈ వివో స్మార్ట్‌ఫోన్ 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.4000 పెరిగి రూ.53,999కి అందుబాటులో ఉంది. అలాగే 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.3000 పెరిగి రూ.53,999కి బదులుగా రూ.56,999కి అందుబాటులో ఉంటుంది.

వివో Y21 ధర

ఈ వివో స్మార్ట్‌ఫోన్‌లోని 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను కొనుగోలు చేయడానికి ఇప్పుడు రూ.20,999 బదులుగా రూ.21,999 చెల్లించాల్సి ఉంటుంది.

వివో Y400 ధర

ఈ ఫోన్ రెండు వేరియంట్లలో వస్తుంది. అవి 8GB + 128GB స్టోరేజ్, 8GB + 256GB స్టోరేజ్. 128GB వేరియంట్ రూ.28,999 బదులుగా రూ.31,999కి అందుబాటులో ఉండగా, 256GB వేరియంట్ రూ.31,999 బదులుగా రూ.34,999కి అందుబాటులో ఉంటుంది. గాడ్జెట్స్ 360 ప్రకారం, వివో వెబ్‌సైట్‌లో అన్ని స్మార్ట్‌ఫోన్‌లు కొత్త ధరలతో జాబితా చేయబడ్డాయి. అయితే, కంపెనీ ఈ ధరల పెంపును అధికారికంగా ప్రకటించలేదు.