మహిళ టెన్నిస్ నంబర్ వన్ ప్లేయర్ ఆర్యనా సబలెంకాకు టొరంలటో మాస్టర్స్‌లో షాక్ తగిలింది. నాలుగో రౌండ్‌లోనే ఆమె టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. మరికొద్ది రోజుల్లో యూఎస్ ఓపెన్ ప్రారంభం కానుంది. ఇలాంటి సమయంలో సబలెంకాకు చుక్కెదురైంది. రష్యాకు చెందిన 16వ సీడ్ ఎకటెరినా అలెక్జాండ్రోవా 7-6 (7/3), 4-6, 6-4 తేడాతో సబలెంకాపై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో ఉక్రెయిన్‌కు చెందిన ఎలినా స్విటోలినాతో ఎకటెరినా తలపడనుంది.