లక్నో: మండువేసవిలో ఉత్తరప్రదేశ్ అకాల వర్షాలతో అతలాకుతమైంది. బలమైన ఈదురుగాలులు, తీవ్ర గాలి దుమారం, భారీ వ ర్షాలు సృష్టించిన పెను బీభత్సం తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. పలు జిల్లాల్లో చెట్లు, వి ద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పాటు ఇ ళ్లు ధ్వంసమై, ఒక్కరోజే 89 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 53 మంది గాయపడ్డారు. క్యుములోనింబస్‌ప్రభావంతో రాష్ట్రవ్యాప్తం గా పలు జిల్లాల్లో వడగళ్ల వాన కురిసింది. రిలీఫ్ కమిషనర్ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం, మే 13న రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులు, వర్షం, వడగళ్ల వాన, పిడుగుల కారణంగా భారీ నష్టం సంభవించింది. దీంతో వేర్వేరు వర్ష సంబంధిత ఘటనల్లో వంద మంది మృతి చెందారు. మరో 53 మంది గాయపడ్డారు. 114 పశువులు మృతి చెందగా, 87 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ బాధిత కుటుంబాలకు 24 గంటల్లోగా సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఘటనను సున్నితంగా పరిశీలించి బాధితులతో నేరుగా మా ట్లాడి ఆర్థిక సాయం అందించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిని జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు రిలీఫ్ కమిషనర్ కార్యాలయం తెలిపింది. అవసరమైన నిధు లు జిల్లాలకు విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.

ప్రయాగ్‌రాజ్ జిల్లాలో హండియా ప్రాంతం లో ఏడుగురు, ఫూల్‌పూర్‌లో నలుగురు, సో రావ్‌లో ముగ్గురు, మెజాలో ఇద్దరు, సదర్‌లో ఒకరు మరణించినట్లు జిల్లా యంత్రాంగం వెల్లడించింది. భదోహి జిల్లాలో తుపాను సం బంధిత ఘటనల్లో కనీసం 16 మంది ప్రా ణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపా రు. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తం భాలు నేలకూలడంతో పాటు ఇళ్లు దెబ్బతిన్నాయని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కున్వర్ వీరేంద్ర కుమార్ మౌర్య చెప్పారు. ఫతేపూర్ జిల్లాలో తొమ్మిది మంది మృతి చెందగా, 16 మంది గాయపడ్డారని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ అవినాశ్ త్రిపాఠి తెలిపారు. ఖాగా తహసీల్‌లో ఐదుగురు మహిళలు సహా ఎనిమిది మంది మరణించగా, సదర్ తహసీల్‌లో ఇం టి గోడ కూలిపోవడంతో మరో మహిళ ప్రా ణాలు కోల్పోయిందన్నారు. ప్రతాప్‌గఢ్‌లో గోడలు, సిమెంట్ షెడ్లు కూలిపోవడం, పిడుగులు పడటం వంటి వేర్వేరు ఘటనల్లో నలుగురు మరణించారు. లాల్‌గంజ్ ప్రాంతంలో ని ఓజా కా పుర్వా గ్రామంలో సిమెంట్ షెడ్ కూలిపోవడంతో భీమ్ యాదవ్ (25) మృతిచెందినట్లు ఎస్పీ దీపక్‌భుకర్ తెలిపారు. బ ఘ్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారి స్వా మి గ్రామంలో గోడ కూలిపోవడంతో భూష ణ్‌పాండే (56) మరణించగా, నరంగ్‌పూర్‌కు చెందిన శాంతిదేవి (46), ఛత్రపూర్ శివాలా రఘ్నా గ్రామానికి చెందిన లాల్‌బహదూర్ (44) కూడా తుపా ను ఘటనల్లో మృతి చెందినట్లు చెప్పారు.

కాన్పూర్ దేహాత్ జిల్లాలో వర్ష సంబంధిత ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కో ల్పోయారు. రసూలాబాద్ ప్రాంతంలోని భౌత రి గ్రామంలో వర్షం సమయంలో మేకలతో కలిసి వేపచెట్టు కింద నిలబడి ఉన్న రుచి (19) అనే యువతి పిడుగు తాకి మృతి చెం దింది. ఘటనలో పలు మేకలు కూడా చనిపోయాయి. అదే సమయంలో సమీపం లో ఉన్న 60 ఏళ్ల వ్యక్తి గాయపడ్డారని పోలీసులు తెలిపారు. డియోరియా జిల్లాలో భీంపూర్ గౌరా గ్రామానికి చెందిన కోమల్ యాదవ్ (62) పిడుగు తాకి మృతి చెందగా, మరో ఇద్దరు గా యపడ్డారు. నెరువారి గ్రామానికి చెందిన రా మ్‌నాథ్ ప్రసాద్ (65) కూడా పిడుగు కారణంగా ప్రాణాలు కోల్పోయారు. సోనభద్ర జి ల్లాలో భారీవర్షాలు, ఈదురుగాలుల కారణం గా చెట్టు కూలిపోవడంతో దాని కింద చిక్కుకుని మాధవ్ సింగ్ (38) మృతి చెందాడు. ప్రభావిత ప్రాంతాలను సం దర్శించి బాధిత కుటుంబాలకు అన్ని విధాల సహాయం అం దించాలని సిఎం యోగి ఆదిత్యనాథ్ జిల్లా కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులను ఆదేశించారు. నష్టం అంచనాల కోసం రెవెన్యూ, వ్య వసాయ శాఖలతో పాటు బీమా సంస్థలు సంయుక్తంగా సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కూడా సూచించారు.