
త్రిసూర్ ః పశ్చిమాసియా యుద్ధం ముగిసినా వెంటనే దేశంలో ఇంధన ధరలు తగ్గుముఖం పట్టేందుకు వీలుండదు. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం , సహజవాయువుల సహాయ మంత్రి సురేష్ గోపీ తెలిపారు. గురువారం ఆయన కేరళలో విలేకరులతో మాట్లాడారు. ఇరాన్ అమెరికా మధ్య ఒప్పందం అమలులోకి వచ్చింది. ఈ దశలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుముఖం పడుతాయి. అయితే దేశంలో ఇందుకు అనుగుణంగా వెంటనే ధరలు తగ్తించడం కుదరకపోవచ్చునని ఆయన ప్రకటించారు. పలు అంశాలు , ప్రత్యేకించి భారత్‌కు తక్కువ చేటుకు చమురు అందుబాటులోకి రావడం కీలక పరిణామం అవుతుందన్నారు.
చమురు సరఫరా దెబ్బతిన్నా దేశంలో చమురు ధరల పరిస్థితిత అదుపులో ఉందని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకూ పెరిగింది కేవలం లీటరుకు దాదాపు రూ 4. అయితే దీనిని అయినా తగ్గించడం అనేది వెంటనే సాధ్యం కాకపోవచ్చునని మంత్రి తెలిపారు. భారత్ తక్కువ రేటుకు సంతరించుకున్న ఇంధనం హర్మూజ్ మీదుగా సక్రమ రీతిలో భారత్‌కు చేకాల్సి ఉంటుంది. ఇంపకు సమయం పడుతుంది. ఇప్పటివరకూ నిలిచిపోయి ఉన్న పలు నౌకలు వరుస పద్థతిలో హర్మూజ్ మీదుగా కదులుతాయి. ఈ క్రమంలో అక్కడి నుంచి భారత్‌కు సరుకు చేరేందుకు సమయం పడుతుందని వివరించారు.
జల మార్గం, అందులోనూ ఇరుకైన దారి ద్వారా నౌకారవాణా అంత తేలిక కాదు,. గమ్యాలు భద్రంగా చేరేందుకు పట్టే సమయం ఎంత అనేది చెప్పలేమన్నారు. మార్గ మధ్యంలో పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక్కడ ఇంధన ధరల సమస్య ఉంటుందని వివరించారు. అంతర్జాతీయ ముడిచమురు ధరలు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ 12000 కోట్ల మేర భారం మోయాల్సి వచ్చింది. కేంద్రమే దీనిని భరించాల్సి వచ్చింది. రాష్ట్రాలు ఏవీ కూడా పన్నులు తగ్గించుకోలేదు, తమ ఆదాయ వనరులు తగ్గుముఖం పట్టేలా చేసే చర్యలకు రాష్ట్రాలు సుముఖంగా లేవని మంత్రి తెలిపారు. ముడిచమురు ధరల ప్రభావం భరిస్తూనే కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగాల్సి వస్తోంది. చమురు కంపెనీలు కార్యకలాపాలు సాగించాల్సి వస్తోందని తెలిపారు.









